శింగనమల నియోగకవర్గం,గూగూడు కుల్లాయి స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని జిల్లా కలెక్టర్ శ్రీ వినోద్ కుమార్ గారిని నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణి శ్రీ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లలో భాగంగా పలు అంశాలపై కలెక్టరు గారికి వినతి చేశారు.బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని,పారిశుద్ధ్య కార్మికుల సమస్య ఉందని, అదనంగా కార్మికులు కేటాయించాలని కోరారు.అలాగే సురక్షితమైన త్రాగునీరు,కనీస అవసరాలు కు నీటి సమస్య ఉందని,నీటి సమస్య పరిష్కారం చేయాలని కలెక్టర్ గారికి ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారు తెలిపారు.ఎమ్మెల్యే శ్రావణి శ్రీ తెల్పిన సమస్యలు పై జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారు స్పందించి,గూగూడు కు వెళ్లి స్వయంగా పరిశీలించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారికి హామీ ఇచ్చారు