అనంతపురం నగర మున్సిపల్ కార్యాలయానికి గురువారం దగ్గుపాటి వెంకట ప్రసాద్ ఎమ్మెల్యే అయ్యాక తొలిసారి రావడంతో మేయర్, డిప్యూటీ మేయర్లు, కమిషనర్, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలు ముగిసాయి, ఇక రాజకీయాలు ఉండవు అని అన్నారు. అలాగే మేయర్, కార్పొరేటర్ ల సహకారంతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తాం అని అన్నారు.