అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా గురువారం జిల్లా ఎస్పీ గౌతమిసాలి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర చరిత్ర లో ఒక మహోజ్వల శక్తి అన్నారు. బ్రిటీష్ వారి గుండెల్లో సింహస్వప్నంగా నిలిచిన విప్లవ జ్యోతి అని, ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వతంత్ర చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయమని కొనియాడారు.