సాగుదారు హక్కు పత్రాలపై కౌలు రైతులు అవగాహన కలిగి ఉండాలని సోంపేట మండల వ్యవసాయాధికారి బి. నర్సింహమూర్తి అన్నారు. సోంపేట మండలంలోని మాకన్నపురం, సుంకిడి, ఎంజీపురం గ్రామ పంచాయతీల్లో గురువారం రైతులకు సాగుదారు హక్కుపత్రాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు యోగేశ్వరరావు, ఈశ్వరరావు, జీవన్, వ్యవసాయ సహాయకులు శ్రీకాంత్, భార్గవి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa