చాల కాలంగా అపరిష్కృతంగా ఉన్న అదృశ్య కేసులపై ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు వేగవంతం చేయాలని జిల్లా ఎస్పీ జి. ఆర్. రాధిక ఆదేశించారు. శుక్రవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు స్టేషన్లు సబ్ ఇన్స్పెక్టర్లతో మిస్సింగ్ కేసుల దర్యాప్తు, విచారణ తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా జిల్లా ఎస్పీ మిస్సింగ్ కేసుల ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు.