శ్రీకాకుళం జిల్లా హోమ్ గార్డు యూనిట్ నందు విధులు నిర్వర్తించి గత నెలలో అనారోగ్యంతో హోంగార్డ్ జి. దాలయ్య మరణించారు. ఈ మేరకు శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పి జి. ఆర్. రాధిక చేతుల మీదుగా జిల్లాలోని సహచర హోంగార్డులు అందరు కలిసి స్వతహాగా అందజేసిన ఒక్కరోజు గౌరవ వేతనం నగదు మొత్తం రూ. 4,16, 000 నగదు చెక్కును అందజేశారు.