అనకాపల్లి జిల్లా కొప్పుగుండుపాలెంలో బాలికను హత్య చేసిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొన్న మంత్రి అనిత.. నిందితుడిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. నిందితుడి పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగినట్లు చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హోం మంత్రి హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.