ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైస్.రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్ కుమార్తె, పీసీసీ చీఫ్ షర్మిల జగన్కు బిగ్ షాక్ ఇచ్చారు. ఇడుపులపాయ వైఎస్సార్ సమాధి వద్ద ఏకకాలంలో నివాళులర్పించాలని ప్లాన్ చేశారు. అయితే షర్మిల ఆ ప్రతిపాదనకు నో చెప్పినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా జగన్, షర్మిల మధ్య విబేధాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికలు పూర్తయ్యాయి. ఓవైపు వైసీపీ, మరోవైపు షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ సైతం ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశాయి. దీంతో కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు సద్దుమణుగుతాయని అంతా ఆశించారు. విజయమ్మ ద్వారా షర్మిలతో కాంపర్మైజ్ అయ్యేందుకు జగన్ విశ్వప్రయత్నాలు చేశారనే ప్రచారం జరిగింది. ఈక్రమంలో వైఎస్సార్ జయంతి సందర్భంగా అన్నా, చెల్లెలు కలుస్తారనే చర్చ నడిచింది. అయితే జగన్, షర్మిల వేర్వేరుగా నివాళులర్పించారు. ఇద్దరి వెంట వైఎస్.విజయమ్మ ఉన్నారు.