కడప జిల్లాలోని బి.కొత్తకోట పట్టణం నగరపంచాయతీగా వద్దు.. మేజర్ పంచాయతీగానే కొనసాగించాలని కోరుతూ ఆదివారం అఖిలపక్ష నాయకులు జ్యోతిసర్కిల్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. బ్యానర్ ను చేతపట్టి రోడ్డుపై రాస్తారోకో చేయడంతో గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. ఈ నిరసనలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీనతాజ్ మాట్లాడుతూ..... బి.కొత్తకోటను నగర పంచాయతీగా ప్రకటిం చడం తప్ప అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయ కుండా మోసగించిందని ధ్వజమెత్తారు. ఎన్నికలు జరిపేందుకు ఏమాత్రం ప్రత్నించలేదని, నగరపంచాయతీ ముసుగులో ఖాళీ స్థలాల ట్యాక్స్ తోపాటు, ఇంటిపన్నులు, నీటిపన్నులు అమాంతం పెంచేసి ప్రజలపై పెనుభారం మోపారని ఆరోపించారు. మున్సిపాలిటీ స్థాయి సౌకర్యాలు లేనప్పుడు నగరపంచాయతీగా కొనసాగించడమే మంచిదని అన్నారు. కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఎంఎన చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడు తూ గత ప్రభుత్వం ఎన్ని అన్యాయాలు చేసినా కనీసం నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా పోయిందని, ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి తమ గళాన్ని వినిపించే స్వేచ్ఛ వచ్చిందన్నారు. బి.కొత్తకోటను మేజర్ పంచాయతీగా కొనసాగించాలని సీఎం చంద్రబాబును కలిసి విన తిపత్రం ఇస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు క్రిష్నప్ప, మనోహర్‌రెడ్డి,రఘునాథ్, బషీర్ లతోపాటు సచిన పాల్గొన్నారు.