శ్రీశైలం నీరు రాయలసీమకు ఇచ్చి కరవును పారదోలాలని సీఎం చంద్రబాబు భావించారని, పోలవరం పూర్తికి ఆలస్యం అవుతుందనే పట్టిసీమ నిర్మాణం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మొత్తం 24 పంపులను విడతలవారీగా రన్ చేసి ఎనిమిది వేల క్యూసెక్కుల నీరు డెల్టాకు అందిస్తున్నామని చెప్పారు. గోదావరి నీరు వృధా కాకుండా కృష్ణా నదిలో కలపడం గొప్ప విషయమన్నారు. చంద్రబాబు ముందుచూపుతో పది లక్షల ఎకరాలకు సాగు నీరు, ముప్పై లక్షల మందికి తాగు నీరు ఇచ్చారని తెలిపారు. పట్టిసీమ కాదు ఒట్టిసీమ అన్న జగన్ రాజకీయాలకు అనర్హుడని, కనీసం అవగాహన లేకుండా ప్రాజెక్టులను పూర్తి గా నాశనం చేశారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో 50 వేల కోట్ల ఆదాయం రైతులకు పట్టిసీమ ద్వారా వచ్చిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.