రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితను మంగళవారం ఉదయం విశాఖ సిటీ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ కింజరాపు ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖలో ఉన్న హోం మంత్రి అనిత నివాసానికి కింజరాపు ప్రభాకర్ వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. స్పెషల్ బ్రాంచ్ కి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని హోం మంత్రి చెప్పారు. త్వరలోనే స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు.