లక్షలాది మంది కార్మికులకు జీవనోపాధి కల్పిస్తూ, నిర్మాణ రంగానికి సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక పాలసీ అమలు చేయడంపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ మంగళవారం పత్రికా ప్రకటనలో ఆనందం వ్యక్తం చేసారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారన్నారు. ఉచిత ఇసుక పాలసీ అమలుతో 40 లక్షల నిర్మాణరంగ కార్మికులకు జీవనోపాధికి అవకాశం కలిగిందన్నారు.