చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చేంత సీను జగన్‌కు లేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోచేసి, ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేసినందువల్లే ఇటీవల ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పి, కనీసం ప్రతి పక్ష స్థానం లేకుండా చేసినా ఇంకా జ్ఞానోదయం కాలేదని మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలను ధ్వంసం చేసిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డిని జైలుకు వెళ్లి పరామర్శించడం..పైగా ఈవీఎంలు పగలకొడితే తప్పెంటని అనడం ఆయన నేర స్వభావాన్ని తెలియజేస్తోందని అన్నారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్నింగ్ ఇవ్వ డాన్ని బట్టి చూస్తే ఆయనకు ఇంకా బుద్ధి రాలేదని అర్థమవు తోందని అన్నారు. మరోసారి చంద్రబాబు మీద అవాకులు చెవాకులు పేలితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.