నంద్యాల జిల్లా, మహానంది సమీపంలోని ఈశ్వర్ నగర్లో చిరుత పులి సంచారం ఆందోళన కలిగిస్తోంది. ఓ గిరిజనుడిపై దాడి చేసిన ఘటనతో పెద్ద ఎత్తున కలకలం రేగుతోంది. నాగన్న అనే గిరిజనుడిపై చిరుత పులి దాడి చేసింది. ఈ క్రమంలోనే అతడికి గాయాలయ్యాయి. బహిర్భూమికి వెళ్లిన సమయంలో నాగన్నపై చిరుత పులి దాడి చేసింది. చాకచక్యంగా తప్పించుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత పులిని పట్టి అటవీశాఖ అధికారులు బోనులో బంధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.