ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా దగ్గర ఆధారాలున్నాయి, విచారణ జరిపించండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 10, 2024, 02:06 PM

వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీఆర్‌ బాండ్ల భారీ కుంభకోణం జరిగిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్దా వెంకన్న ఆరోపించారు. మంగళవారం మంగళగిరిలో డీజీపీ ద్వారకా తిరుమలరావు ను కలిసి ఫిర్యాదు చేశారు. తగిన ఆధారాలున్నాయని, సీఐడీతో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం బుద్దా వెంకన్న మాట్లాడుతూ టీడీ ఆర్‌ బాండ్ల పేరిట రూ.వేల కోట్లు దోచుకున్నారని, ఇందుకు మాజీ సీఎం జగన్‌ సూత్రధారి అన్నారు. ప్రభుత్వం భూముల ధరలు పెంచుతున్నచోట ప్రభుత్వ స్థలం గజం రూ.2 వేల ధరతో ఎకరాలకెకరాలు వైసీపీ నేతలు కొనుగోలు చేసి రూ.30 వేలకు విక్రయించారన్నారు. భూములు కొనుగోలు చేసి బాండ్లను జారీ చేశారని, సీఎం పేషీ నుంచి కలెక్టర్లపై ఒత్తిడి తెచ్చి భూముల ధరలను పెంచేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో మంత్రి నారాయణ వచ్చాక ఈ కుంభకోణం బయట పడిందన్నారు. జగన్‌ దోచుకున్న లక్షల కోట్లను తిరిగి ప్రభుత్వానికి కట్టించేంతవరకు తన పోరాటం ఆగదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com