గత ప్రభుత్వం హాయాంలోపడిన ఇబ్బందులు, కష్టాలు కూటమి ప్రభుత్వంలో ఉండవని నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగాల అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక, సినిమాటోగ్రిఫి శాఖమంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరం నేర్కేడో ఆధ్వర్యంలో స్థానిక హోటల్ షెల్టాన్‌లో ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ప్రజాప్రతినిధులకు అభినందన సత్కార సభ ఘనంగా నిర్వహించారు. ఈ సభకు ముఖ్మఅతిథులుగా మంత్రి దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, మాజీ ఎంపీ ఉండవల్లి, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజులు హాజరయ్యారు. వారిని నర్కేడో రాష్ట్ర అధ్యక్షుడు గద్దె చక్రధర్, రాజమండ్రి చాఫ్టర్ అధ్యక్షుడు కే నాగేష్, కార్యదర్శి కూచిపూడి శ్రీనివాసరావులు ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ రంగాల అభివృద్ధి అనేది ఎంతో కీలకమన్నారు. కార్యక్రమంలో బిల్డర్లు, రియల్ ఎస్టేస్ వ్యాపారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa