ప్రేరేపిత ప్రజనం ప్రక్రియ ద్వారా దేశంలో మొదటగా 1957 జూలై 10న చేపల బ్రీడింగ్ ప్రక్రియ విజయవంతం చేసిన డా. హీరాలాల్ చౌదరి, డా. కే హెచ్ ఆలీకున్హి శాస్త్రవేత్తల కృషి మరువలేనిదని జిల్లా మత్యశాఖ అధికారి వి.కృష్ణారావు తెలిపారు. నేషనల్ ఫిష్‌పార్మర్స్‌డే సందర్భంగా బుధవారం కడియం లో జిల్లా మత్స్యశాఖ కార్యాలయం వద్ద జిల్లా మత్స్యశాఖ అధికారి వి.కృష్ణారావు అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యరంగం ఆరోగ్యభద్రతలో, ప్రోటీన్ సెక్యూరిటీలో గణనీయ పాత్ర వహిస్తుందన్నారు. ఆక్వారంగ అభివృద్ధికి కృషి చేసిన డా. హీరాలాల్‌చౌదరి, డా. కెహెచ్ ఆలీకున్హి శాస్త్రవేత్తలను స్మరించుకోవడం మన కర్తవ్యం అన్నారు. ఆక్వా రైతులు, చేపలు రొయ్యలు అమ్మేవారు, చేపల వంటకాలు తయారు చేసే వారు ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులు అందించాలన్నారు. ఈ రంగంలో విశేషకృషి చేసిన పలువురిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మత్యశాఖ సహాయ సంచాలకులు షేక్ దిల్షాద్, రాజమహేంద్రవరం ఆర్ట్స్‌కళాశాల లెక్చరర్ దుర్గారావు, తేజ, కళాశాల విద్యార్థులు, మత్యకార సహకార సంఘం సభ్యులు పాల్గొన్నారు.