వచ్చే నెల ఒకటి నుంచి ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ఉపయోగించాలని పెనమలూరు ట్రాఫిక్ సీఐ రవికుమార్, ఎస్సై శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం కానూరు కామయ్యతోపు సెంటరులో ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హెల్మెట్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. హెల్మెట్ లేని ప్రయాణికులపై మోటారు వాహన చట్టం పరిధిలోని సెక్షన్ల ప్రకారం జరిమానాలు విధిస్తామని తెలిపారు.