అనధికార నిర్మాణాలు చేస్తున్న భవన యజమానులకు నోటీసులివ్వాలని ముడా వీసీ పి.వెంకటరమణ ఆదేశించారు. నిబంధనల ప్రకారం నిర్మిస్తున్న భవనాలకు మాత్రమే అనుమతులివ్వాలని ఆయన సూచించారు. బుధవారం మచిలీపట్నం ముడా కార్యాలయం వద్ద ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులకు లే అవుట్ అప్రూవల్ నిబంధనలపై నిర్వ హించిన శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. బిల్డింగ్ అప్లికేషన్, అక్రమ నిర్మాణాలు, తాత్కాలిక ఆక్రమణలు, అప్రూవుడ్ లే అవుట్, మార్టిగేజి, రిమూవల్స్ రిజి స్టర్లను నిర్వహించాలని సూచించారు. ముడా ప్లానింగ్, జూనియర్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.