వ్యాపారులు ఎటువంటి రిజిస్ర్టేషన్ లేకుండా వ్యాపారం చేయడం తగదని శ్రీకాకుళం వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ జి.రాణి మోహన్ అన్నారు. స్థానిక వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో బుధవారం వివిధ వర్తక సంఘాలు, అకౌంటెంట్ సభ్యులతో జీఎస్టీ ఫెసిలిటేషన్ డ్రైవ్‌పై అవ గాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్న వ్యాపారుల కు సహకారం అందిస్తామన్నారు. కాంపోజిషన్ ట్యాక్స్ పరిధిలో ఉన్న వారు నార్మ ల్ ట్యాక్స్ పరిధిలోకి రావాలని దీనివల్ల కలిగే ఉపయోగాలను వ్యాపారులకు వివ రించారు. కార్యక్రమంలో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ డి.ప్రతిభ దేవి, జీఎస్టీ అధికారి జి.హైమావతి, బీవీటీ రమణరావు, వర్తక సంఘాల నాయకులు సాంబ మూర్తి, మెట్ట నాగరాజు, శ్రీను, ఆనంద్, ఆడిటర్స్ ప్రతినిధి శ్యామ్ పాల్గొన్నారు.