గురజాల నియోజకవర్గ పరిధిలోని దైద, గుత్తికొండబిళం, కాట్రపాడు, మోర్జంపాడు బుగ్గమల్లేశ్వరస్వామి దేవాలయాల ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా గుర్తించాలని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, కలెక్టర్ అరుణ్‌బాబుకు సూచించారు. బుధవారం పిడుగురాళ్లకు వచ్చిన కలెక్టర్ అరుణ్‌బాబు ఆర్అండ్బీ బంగ్లాలో యరపతినేనితో కలసి వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యాటక కేంద్రాల స్థితిగతులను కలెక్టర్‌కు వివరించి, ఆయా ప్రాంతాలను సందర్శించాలని యరపతినేని కోరారు.