అద్దంకి ప్రభుత్వ వైద్యశాల, ప్రస్తుతం 30 పడకల ఆసుపత్రిగా కొనసాగుతుందని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 50 పడకల వైద్యశాలగా స్థాయిని పెంచాలని శుక్రవారం, డి. సి. హెచ్. ఎస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్. శేషు కుమార్ తెలియజేశారు. జాతీయ, రాష్ట్రీయ రహదారులకు, అనుసంధానంగా ఉన్న అద్దంకిలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వైద్యశాల నందు ట్రామ కేర్ విభాగాన్ని అందుబాటులోకి తీసుకురావాలని తెలియజేశారు.