సింహాచలం పుణ్యక్షేత్రంలో వరాహ లక్ష్మి నరసింహస్వామిని శుక్రవారం చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ. ఓ శ్రీనివాసమూర్తి ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యే కుటుంబీకులకు స్వాగతం పలికి దర్శనం చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు. చీరాల నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే కొండయ్య స్వామి వారిని ప్రార్థించారు. కొండయ్య సతీమణి బాలకొండమ్మ, కుమారుడు అమర్నాథ్ కూడా పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa