గొర్రెలు, మేకలకు నీలి నాలుక టీకాలు వేయించాలని మండల పశువైద్యాధికారి శ్రీనివాస తెలిపారు. ముద్దనూరు మండలం తిమ్మాపురం గ్రామంలో శుక్రవారం శ్రీనివాస ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు నీలి నాలుక టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గొర్రెలు, మేకలకు నీలి నాలుక టీకా వేయకపోతే నోటి పుండ్లు, జ్వరం వచ్చి నీరశించి చనిపోయే అవకాశం ఉందన్నారు. మండల వ్యాప్తంగా 9, 500 గొర్రెలు, మేకలకు టీకాలు వేసినట్లు చెప్పారు.