దువ్వూరు మండల కేంద్రంలో డ్రైనేజి వ్యవస్థ అద్వానంగా తయారైందని స్థానికులు అధికారులకు విన్నవించడంతో శుక్రవారం ఎంపీడీఓ సుగుణ శ్రీ ఆదేశాల మేరకు పారిశుధ్య కార్మికులు డ్రైనేజీ పూడిక లోని వ్యర్ధాలను తీసివేశారు. పూడిక తీసివేత కు స్పందించిన ఎంపీడీవో కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. డ్రైనేజీ సమస్యను తలెత్తకుండా ఎప్పటికప్పుడు పూడిక తీసివేత చేపట్టాలని విన్నవించారు.