ఎర్రగొండపాలెం మండలం నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పాలంక పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తులకు ఫారెస్ట్ శాఖ అధికారులు పెట్టిన ఆంక్షలను ఎత్తివేయాలని పాలంక భక్త బృందం అధికారులను కోరారు. శుక్రవారం తాహసిల్దార్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రుసుము, అన్నదానం తదితర అంశాలపై వారు అభ్యంతరాలు తెలిపారు. ఉన్నతాధికారులు ఆలోచన చేపట్టి ఆంక్షలు సరిచేయలంటున్నారు.