సీఎం చంద్రబాబు కక్షసాధింపులో భాగంగానే వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై కేసు నమోదు చేశారని, కేసులు పెట్టి వైయస్ జగన్‌ను భయపెట్టలేరని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. శుక్రవారం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ‘రఘరామ ఫిర్యాదుపై వైయస్ జగన్‌మోహన్ రెడ్డితో పాటుగా పోలీసు అధికారులపై కేసు నమోదు చేయడం అప్రజాస్వామికం. సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కక్ష సాధింపు చర్యలో భాగంగానే వైయస్ జగన్‌పై కేసు నమోదు చేశారు. అధికారం ఉంది కాబట్టి పోలీసులపై ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసులు పెడుతున్నారు. లోకేష్ రెడ్ బుక్‌లో భాగంగానే ఈ కేసు నమోదు చేశారు. మీరు ఇలాంటి కేసులు పెట్టి వైయస్ జగన్‌ను భయపెట్టలేరు. పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు తనను వేధించారని రఘురామ మేజిస్ట్రేట్‌కు నాడు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపైన రఘురామ.. సుప్రీంకోర్టుకు వరకు వెళ్లారు. అక్కడ కూడా ఈ కేసు వీగిపోయింది. కానీ, ఇప్పుడు మాత్రం ఈ ఘటనపై కేసు ఎందుకు నమోదు చేశారని ప్రశ్నించారు.