పలాసలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు స్థలాలను కేటాయించాలని ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. ఈ మేరకు శుక్రవారం శ్రీకాకుళం కలెక్టరేట్‌లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ నవీన్ లను కలిసి వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పలాసలో ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ ఇనిస్టి ట్యూట్, కృషి విజ్ఞాన కేంద్రం, జీడి పరి శోధన కేంద్రం నిర్మా ణాలు చేపట్టనున్నందున స్థలాలు కేటాయించాలన్నారు. మత్స్యకారులకు వినియోగపడే సీమెన్, మర్చంట్ నేవీ ఇనిస్టి ట్యూట్ ఏర్పాటు చేసి వారికి ఉపాధి కల్పించేందుకు సంకల్పించామని, దీనికి అవసరమైన భూములు ఇప్పించాలని కోరారు. కృషి విజ్ఞాన కేంద్రం, జీడి పరి శోధనా కేంద్రా లకు అవసరమైన భూములు కేటాయిస్తే ప్రభుత్వంతో చర్చించి త్వరితగతిన పనులు పూర్తి చేస్తామన్నారు. గతంలో ఏపీఐఐ సీకి కేటాయించిన 61 ఎకరాల స్థలం కోర్టు వివాదంలో ఉండి పోయిందని, దీన్ని త్వరితంగా పరిష్కరించి వ్యాపారులకు అం దించాలని కోరామన్నారు. గిరిజనుల సాగులో ఉన్న భూము లకు హక్కులు కల్పించి వారి జీవనోపాధికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని, ఇరిగేషన్ ప్రాజెక్టు లకు నిధులు కేటాయించాలని కోరారు. వీటిపై కలెక్టర్ సాను కూలంగా స్పందించారని, వీటికి సంబంధించిన పనులు వేగ వంతం అవుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమె వెంట టీడీపీ జిల్లా కార్యదర్శి పీరుకట్ల విఠల్‌రావు, వ్యాపా రవేత్త మల్లా శ్రీనివాసరావు ఉన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖాధికారులతో ఎమ్మెల్యే గౌతు శిరీష సమీక్ష నిర్వ హించారు. నియోజకవర్గంలో గతంలో ఎన్ని ఇళ్లు మంజూరయ్యాయి, ఎన్ని పూర్తయ్యాయని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ నగేష్, డీఈఈ కె.అప్పారావు, ఏఈలు రాంబాబు, వైకుంఠ రావు, శ్రీకాంత్, రాజ్‌మోహన్ పాల్గొన్నారు.