విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న యూటీఎఫ్ స్వర్ణోత్సవాలు నవంబరు 9, 10 తేదీల్లో శ్రీకాకుళం జిల్లా, మందసలో నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వర్లు అన్నారు. హరిపురం హైస్కూల్ ఆవరణలో శుక్రవారం సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ స్వర్ణోత్సవాల్లో విద్యారంగాన్ని కాపాడేందుకు దోహదపడే అంశాలపై చర్చించనున్నట్లు తెలి పారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిషోర్ కుమార్ మాట్లా డుతూ.. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో విద్యా వ్యవస్థ భ్రస్టుపట్టిపోయిందని విమర్శం చారు. కొత్త ప్రభుత్వం వెంటనే 117 జీవో రద్దు చేసి సమాంతర మీడియం విధా నాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. స్వర్ణోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎల్.బాబూరావు, బి.శ్రీరామ్మూర్తి, మండల అధ్య క్ష, కార్యదర్శులు గున్న రమేష్, వై.వాసుదేశరావు, ప్రతిని ధులు గుంట కోదండరావు, కంచరాన మాధవరావు, జగదీష్, దాసరి ఈశ్వరరావు, రవికుమార్, తారకేశ్వరరావు పాల్గొన్నారు.