కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని అభివృద్ధి చేస్తామని, పారిశ్రామిక రగం అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు తోనే సాధ్యమని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. బందరు రోడ్డులోని ఓ హోటల్‌లో శుక్రవారం ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా, దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇం డస్ర్టీ ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అవకాశాలు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా సారథి విచ్చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి సీఎం చంద్రబాబు అన్ని చర్యలు తీసుకున్నారని, పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలతో పాటు అనుమతులను సింగిల్ విండో విధానంలో అంది స్తోందని తెలిపారు. రాష్ట్రంలో సముద్ర, నదీ తీరప్రాంతం అధికంగా ఉన్నం దున ఇక్కడ అనేక పంటలు పండుతున్నాయని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతో అనేకమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలి పారు. కేంద్ర ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అనేక రాయితీలు ఇస్తుందని, దేశంలోని పలు ప్రాం తాల్లో యూనిట్లు, పరీక్ష కేంద్రా లను ఏర్పాట్లు చేస్తున్నారని మినిస్ర్టీ ఆఫ్ పుడ్ ప్రాసెసింగ్ అడిషనల్ సెక్రటరీ మిన్హజ్ ఆలం తెలిపారు. ఈ రం గంలో ఎంతో భవిష్యత్తు ఉంటుందని, యువ పారిశ్రామికవేత్తలు ముందు కొచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేస్తే కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుం దని ఆయన తెలిపారు. కార్యక్రమంలో దళిత్ ఇండియన్ చాంబర్ ఆప్ కామర్స్ అండ్ ఇండస్ర్టీ జాతీయ అధ్యక్షుడు నర్రా రవికుమార్, డిక్కీ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజానాయక్, జాతీయ వర్టికల్ హెడ్ మం జుల్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు ఆశీర్వాదం, ఉపాధ్యక్షురాలు రాజమణి, ఎస్ బీఐ డీజీఎం మనీష్‌కుమార్ సింధియా, పారిశ్రామికవేత్త ముత్తవరపు మురళీకృష్ణ పాల్గొన్నారు.