నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమరిలో ఏడు రోజులైనా బాలిక మిస్సింగ్ కేసు మిస్టరీ వీడలేదు. ముగ్గురు మైనర్ అబ్బాయిలు.. బాలికపై అత్యాచారం చేసి ఆపై హతమార్చారు. బాలిక మృతదేహం నేటికీ లభ్యం కాలేదు. మృతదేహం ఎక్కడ పడేసిన విషయంలో నిందితులు పూటకో మాట చెబుతున్నారు. నిందితుల తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. రాత్రి ముచ్చుమరి సమీపంలోని ఓ ప్రదేశంలో పోలీసులు జేసీబీతో తవ్వించారు. అక్కడ కూడా బాలిక మృతదేహం లభ్యం కాలేదు. ఇవాళ సాయంత్రానికల్లా బాలిక ఆచూకీ తెలపాలని పోలీసులకు బాధితులు డెడ్ లైన్ విధించారు.