దళిత మహిళను హత్య చేసిన దుండగులను తక్షణం అరెస్టు చేయాలని కెవిపిఎస్ జిల్లా గౌరవాధ్యక్షులు పెద్దన్న ఆదివారం డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాతన హల్లి గ్రామానికి చెందిన దళిత గుండమ్మను భూ వివాదంలో అదే గ్రామ పెత్తందారులు భూస్వాములు అయిన రాఘవేంద్ర రెడ్డి, శ్రీధర్ రెడ్డిలతో పాటు మరో నలుగురు 4 రోజుల క్రితం ట్రాక్టర్ తో తొక్కించి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.