విజయవాడ మంగళగిరిలోని తెనాలి ఫ్లై ఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకోగా అటుగా రోడ్డు పై వెళ్తున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ తన కాన్వాయ్ ఆపి మానవత్వం ను చాటుకున్నారు. మంత్రి క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆటోను కారు ఢీకొనడంతో ప్రమాదంలో బాలుడి మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి కోరారు.