తులసి ఆకులు వ్యాధి నిరోధక శక్తిని వద్ధి చేయడమే కాకుండా.. శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఐదు లేదా ఆరు ఆకుల కషాయాన్ని మరగించి టీ మాదిరి చేసుకుని తాగితే, దగ్గు, జలుబు, ఆస్తమా వంటి సమస్యలు అదుపులోకి వస్తాయి. ఇక యాంటీ ఆక్సిడెంట్ అయిన పసుపును పేస్ట్‌గా రోజూ ముఖానికి వాడితే ముఖం మీద ఉండే సన్నని వెంట్రుకలు రాలిపోతాయి. అలాగే మొటిమలు, మచ్చలు కూడా మాయమవుతాయి.