హిందూపురం పట్టణంలో కర్ణాటక ప్రాంతానికి చెందిన లక్ష్మి అనే వృద్ధురాలిని అతని కుమారుడు బస్టాండ్లో వదిలేసి వెళ్లిపోయాడు. ఈమె కొడుకు కోసం రాత్రి వరకు అక్కడే కూర్చుని ఉండగా మంగళవారం అల్ ఇందాద్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తెలుసుకొని ఆమెకు భోజనం తినిపించి వారి కుటుంబ సభ్యులు వచ్చేంతవరకు అనాధాశ్రమంలో వదిలిపెట్టారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు అమన్, సభ్యులు ఉస్మాన్, రిహాన్ తదితరులు పాల్గొన్నారు.