తమిళనాడులో మాజీ మంత్రి ఎంఆర్ విజయ్ భాస్కర్ మంగళవారం అరెస్ట్ అయ్యారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ఆయన రవాణా మంత్రిగా పని చేశారు. కరూర్ వాసి ప్రకాశ్‌కు చెందిన రూ.100 కోట్ల విలువైన 22 ఎకరాల భూమిని ఆయన కాజేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఆయన గత నెలరోజులుగా పరారీలో ఉన్నారు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దీంతో కేరళలో దాక్కున్న ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.