కానూరు కార్మెల్ మాత పుణ్యక్షేత్రం మహోత్సవం విచారణ గురువులు ఫాదర్ సలివేంద్ర శౌరి ఆధ్వర్యంలో నవదిన ప్రార్ధనలు ఘనంగా నిర్వహించారు. కార్మెల్ మాత పుణ్యక్షేత్రం మహోత్సవం సందర్భంగా విజయవాడ మేత్రాసన పీఠాధిపతులు మోస్ట్ రెవ బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు దివ్యబలి పూజను కొనియాడి సుమారు వెయ్యి మంది విశ్వాసులకు భద్రమైన అబ్యగం ఇచ్చి దివ్య సప్రసాదం అందించారు. పదవ తరగతి, ఇంటర్లలో ఎక్కువగా మార్కులు సాధించిన విద్యార్థులకు స్కాలస్కిప్ అందించి భక్తులఅందరిని ఆశ్విరోదించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్లు దేవదానం, రత్న రాజు, తాళ్ళూరి ఆనంద్- పిఐయంఇ, సిటిసి సిస్టర్స్, ఉపదేశకులు, కౌన్సిల్ సభ్యులు, దళ సభ్యులు, యూనిట్స్ సభ్యులు, గంగూరు, పోరంకి,సాలిపేట, కామమయ్యతోపు, కానూరు, వివిధ ప్రాంతాలనుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికి ప్రేమ విందును యార్పాటు చేశామని, విద్యుత్ దీపాలంకరణలు వివిధ రూపముల మేరీ మాత వేషాదరణలు అందరిని ఆకట్టుకున్నాయని పుణ్యక్షేత్రం విచారణ గురువులు ఫాదర్ సలివేంద్రం శౌరి-ఓసిడి తెలిపారు.