ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేర్చేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో మహిళలకు శుభవార్త చెప్పింది.. ఏపీ మంత్రి అధకారికంగా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో మహిళలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణం అమలుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆగష్టు 15 నుంచి ఏపీలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్వీట్ చేశారు. ప్రజా ప్రభుత్వంలో మరో సంక్షేమ నిర్ణయం.. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ ట్వీట్ చేశారు. ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో కూడా దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు.
రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై.. కర్ణాటక, తెలంగాణలో అధికారులు అధ్యయనం చేశారు. ఆ రాష్ట్రాలకు వెళ్లి అక్కడ పథకం అమలు జరుగుతున్న తీరును ఆరా తీశారు. ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకం కింద రోజుకు ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారు.? ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది? అనే అంశాలపై వివరాలు సేకరించారు. ఈ పథకం అమలులో ఎలాంటి సమస్యలు వస్తాయి? వంట అంశాలతో నివేదికను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం.. త్వరలోనే విధివిధానాలు కూడా ప్రకటిస్తారని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ పొరుగునే ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంది. ఏపీకి చెందిన అధికారులు ఈ రెండు రాష్ట్రాలకు వెళ్లి అక్కడ పథకం అమలవుతున్న తీరును పరిశీలించారు. ప్రధానంగా జీరో టికెట్ విధానంపై రెండు రాష్ట్రాల్లో అధ్యయనం చేశారు అధికారులు. ఇక ఏపీలో ఉన్న పరిస్థితులు, రూట్లకు అనుగుణంగా ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలనే అంశంపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ప్రాథమికంగా ఓ నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.. అయితే తెలంగాణలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానమే సరిపోతుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ప్రధానంగా నడుస్తున్నాయి.
విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో సిటీ ఆర్డీనరీ బస్సులు, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. అలాగే ఈ ఉచిత ప్రయాణం కొత్త జిల్లాల పరిధిలోపే పరిమితి ఉంటుందా?.. ఉమ్మడి జిల్లాల పరిధిలో అనుమతిస్తారా అనే అంశంపైనా క్లారిటీ రావాాల్సి ఉంది. మరి ెలాంటి విధివిధానాలను ఖరారు చేస్తారన్నది చూడాలి.. ఈ ఉచిత బస్సు ప్రయాణంపై ఇవాళ జరిగే కేబినెట్ భేటీ తర్వాత ఓ క్లారిటీ వస్తుందనే చర్చ జరుగుతోంది. అయితే ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.