ఆషాడ ఏకాదశి పర్వదినాన్ని సత్యసాయి సన్నిధిలో జరుపుకోవడానికి మహారాష్ట్ర గోవా భక్తులు దిండి పర్తియాత్ర పేరుతో పుట్టపర్తికి చేరుకున్నారు. ధర్మవరం రైల్వే స్టేషన్ నుంచి సత్యసాయి, పండరినాథుడిని పల్లకిలో ఊరేగిస్తూ దాదాపు 3, 000 మంది భక్తులు మంగళవారం రాత్రి పుట్టపర్తికి చేరుకోగా వారికి సత్యసాయి ట్రస్ట్ సభ్యులు రత్నాకర్, జాతీయ సత్య సాయి సంస్థల అధ్యక్షుడు నిమిష్ పాండే స్వాగతం పలికారు.