గ్రామస్థాయి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, డి ఆర్ డి ఏ, డ్వామా, జడ్పీ డిప్యూటీ సీఓ లలితా బాయలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. గ్రామీణ స్థాయిలో సమస్యలపై చర్చించి అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.