యాడికి మండలం చందన గ్రామంలో మంగళవారం రాత్రి మొహర్రం వేడుకలు ఘనంగా నిర్వహించారు. హిందూ -ముస్లింల ఐక్యంగా మొహరం వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా పెద్ద సరిగెత్తు వేడుకలను నిర్వహించారు. పానకాలు ఊరేగించారు. మొక్కుబడులు తీర్చుకున్నారు. పీర్ల మకాన్ ల వద్ద బారులు తీరి చక్కెరలు చదివించారు. ఎక్కడ చూసినా సందడి, కోలాహలం నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa