రాష్ట్ర ప్రభుత్వం తెలుగులోనే జీఓలు ఇవ్వాలని పుట్లూరు మండలం బీజేపీ మండల అధ్యక్షుడు రామంజి యాదవ్ కోరారు. పుట్లూరులో మీడియాతో మాట్లాడుతూ ప్రజల కోసమే పరిపాలన చేస్తున్నప్పుడు ప్రజలకు అర్థమయ్యే తెలుగులోనే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. ప్రభుత్వం జీఓలు ఇంగ్లిషులో ఉండటం వల్ల తెలుగు ప్రజలకు అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు.