భీమిలిలో సహజసిద్ధంగా ఏర్పడిన ఎర్రదిబ్బలను కొంతమంది అవినీతిపరులు ఖననంచేస్తున్నట్లు వస్తున్న వార్తలపై గంటా నూకరాజు బుధవారం స్పందించారు. గత ఐదేళ్ల వైకాపా పాలనలో ఏ స్థాయిలో అవినీతికి అద్దంపట్టారో దీనినిబట్టి అర్ధమవు తుందని వ్యాఖ్యానించారు. నేటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో ఎర్రదిబ్బలను వైసిపీ గూండాలు ఏ విధంగా దోచుకుంటున్నారో వివరిస్తూ ఆందోళన చేశారని అన్నారు.