ఇసుక మరియు మాదక ద్రవ్యాల రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారి, అడిషనల్ ఎస్పీ గంగాధరం ఆదేశించారు. బుధవారం నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక ఎస్ఈబి కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది కట్టుదిట్టమైన వ్యవహార శైలితో విధులు నిర్వహించాలని అన్నారు. అనంతరం రికార్డులను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో సిఐ సతీష్ కుమార్ పాల్గొన్నారు.