రాష్ట్ర బీసీ సంక్షేమం మరియు చేనేత శాఖ మంత్రి ఎస్ సవిత ను ఎస్. కోట ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి బుధవారం అమరావతి టిడిపి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎస్. కోట నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధి పనులు తదితర అంశాలపై కాసేపు మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాంప్రసాద్, తదితర నియోజకవర్గ టిడిపి నాయకులు పాల్గొన్నారు.