నాసి రకం నారు అమ్ముతున్న నర్సరీ యా జమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి జమలయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మదనపల్లె స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏపీ కౌలు రైతుల సంఘం, ఏపీ రైతుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... రాష్ట్రంలో 20 నుంచి 30 వేల ఎకరాల్లో బొప్పాయి సాగవుతుండగా, సన్న, చిన్న కారు కౌలు రైతులే అధికంగా ఉన్నారన్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని నర్స రీ యాజమానులు నాసిరకం నారును అంటగట్టి కోట్లాది రూపాయలను సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. రైతులు మాత్రం పీకలలోతు అప్పు ల్లో కూరుకుపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలు చేసు కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో నాసిరకం విత్తనాలు అమ్ముతున్న కంపెనీలుౖ, నాసిరకం నారు పెంచుతున్న నర్సరీలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. జిల్లాలోనే దాదాపుగా పదివేల ఎకరాల్లో బొప్పాయి పంట వేసి నష్ట పోయారని గుర్తు చేశారు. ఎనిమిది నెలల క్రితం కలికిరి, మదనపల్లెలోని నర్సరీల నుంచి ఒక మొలక రూ. 12 చొప్పున నారు కొనుగోలు చేసి రైతు లు నాటారని, వాటికి కుక్క మూతి పిందెలే కాస్తున్నాయని, చెటుపై కా య నిలబడడం లేదని రైతులు ఆరో పించారు. ఎకరానికి 2 నుంచి మూ డు లక్షలు ఖర్చు చేసి పంట సాగు చేస్తే, కనీసం రెండు టన్నులు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. కౌలు రైతులకు ఉద్యాన అధికారులు ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వడంలేదన్నారు. నర్సరీలపై నిఘా లేకపోవడంతో విచ్చల విడిగా నాసిరకం ఉత్పత్తులు విక్రయిస్తున్నారరు. బొప్పాయి పంటకు బీమా అమల్లో లేదన్నారు. భవిష్యతలోనైనా అఽ దికారులు నాసిరకం విత్తన విక్రయాలపై నిఘా పెట్టాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం గౌరవాధ్యక్షుడు పీఎల్ నరసింహులు, రైతు సంఘం నాయకులు రామకృష్ణ, గంగిరెడ్డి, అనిల్‌కుమార్, గంగరాజు, రామమూర్తి, గురునాథ్, నారాయణ, రాఘవేంద్రయాదవ్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa