పేదరికం నిర్మూలనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. బుధవారం కోటనందూరు మండలంలోని జగన్నాధపురం లో ఎమ్మెల్యే యనమల దివ్యకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పరిస్థితిని జగన్ అధోగతి పాలు చే శారని, దీనిని ముఖ్యమంత్రి చంద్రబాబు గాడి లో పెట్టేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టారన్నార్నారు. ట్రాక్టర్ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన షెల్టర్‌ను ప్రారంబించారు. అనంతరం ఎమ్మెల్యే దివ్యను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మేల్యే రాజా అశోక్‌బాబు, యనమల రాజేష్, టీడీపీ మండలాధ్యక్షుడు గాడి రాజుబా బు, లోవ దేవస్థానం చైర్మెన్ గొర్లి అచ్చియ్యనాయుడు, సుర్ల లోవరాజు, మోతుకూరి వెంకటేష్, యర్ర చినసత్యనారాయణ, మాతిరెడ్డి భాస్కర్‌రావు, మాతిరెడ్డిబాబులు, గుడివాడ అప్పలనాయుడు మాస్టారు, పెంటకోట బాస్కర్ సత్యనారాయణ, గుడివాడ నాని, గొర్లి రాజు ఉన్నారు.