రాయచోటి పట్టణంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని బుధవారం ఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన విద్యాసాగర్‌నాయుడు కుటుంబ సమేతంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. వీరికి జిల్లా దేవదాయశాఖ అధికారి విశ్వనాధ్, ఆలయ కార్యనిర్వాహణాధికారి డీవీ రమణారెడ్డిల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం వీరభద్రస్వామి, భద్రకాళీ అమ్మవార్ల విశిష్టత వివరించి, పట్టువస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.