పలమనేరు పట్టణంలో వీధికుక్కల బెడద తప్పించాలని స్థానికులు శుక్రవారం కోరారు. వీధికుక్కల సంఖ్య విపరీంతంగా పెరిగి పోయింది. పట్టణంలోని జిలాని సర్కిల్, ఆది ఆంధ్రవీధి, మసీదు వీధి, పెద్దగాండ్లవీధి, జెండామరం, కాకాతోపు, గాంధీనగర్ ప్రాంతాల్లో వీధికుక్కల బెడద తీవ్రంగా ఉంది పిల్లలు, మహిళలు కుక్కల బారిన పడుతున్నారు. అధికారులు స్పందించి వీధికుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.