వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని సీఐ సుదర్శన్ ప్రసాద్ సూచించారు. రంగంపేట క్రాస్ బ్రిడ్జి వద్ద గురువారం సిబ్బందితో కలసి వాహన తనిఖీలు చేపట్టారు. రోడ్డుభద్రత నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదన్నారు. ఆటో డ్రైవర్లు యూనిఫామ్ విధిగా ధరించాలన్నారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదన్నారు.